హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే?

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, బ్యూటిరిక్ యాసిడ్ వంటి పోషకాలు శరీరానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా వేడి అన్నంలో నెయ్యి కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. నెయ్యిలో విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. అలాగే కూరల్లో ఉండే కొన్ని పోషకాలను శరీరం మరింత సమర్థంగా గ్రహించేందుకు కొవ్వు అవసరం అవుతుంది.