హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జామాకుతో.. జుట్టు ఆరోగ్యంగా..!

ఒత్తిడి, కాలుష్యం వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్య పెరుగుతోంది. దీనికి జామాకులు అద్భుత పరిష్కారం. లీటరు నీటిలో జామాకులు వేసి 20 నిమిషాలు మరిగించి, వడకట్టాలి. షాంపూ చేశాక ఈ నీటితో మర్దన చేసి కడిగితే జుట్టు ఒత్తుగా, సిల్కీగా మారుతుంది. జామాకుల పొడి పేస్ట్ తలకు పట్టిస్తే చుండ్రు, దురద తగ్గుతాయి. జామాకులు కొలాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టును ఒత్తుగా మారుస్తాయి.