హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వర్షాకాలంలో ఏం తిన్నా అరగట్లేదా..!

వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ నెమ్మదించడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని నివారించడానికి వేడివేడిగా ఉండే తాజా ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. పచ్చి కూరగాయలకు బదులుగా ఉడికించినవి తినడం మంచిదని. అలాగే నీటిని బాగా మరిగించి తాగాలన్నారు. అల్లం, జీలకర్ర వంటివి ఆహారంలో ఎక్కువగా చేర్చుకుంటే పేగుల ఆరోగ్యం మెరుగుపడి, జీర్ణశక్తి ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.