భద్రాసనం వేయడం వల్ల శరీరానికి, మనసుకు ఎన్నో లాభాలు కలుగుతాయి. తొడలు, గజ్జలు, మోకాళ్లు, చీలమండల కీళ్ల కదలికలను మెరుగుపరుస్తుంది. పొత్తికడుపు భాగంలో రక్త ప్రసరణను పెంచి మలబద్ధకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. వీపు నొప్పిని తగ్గించి, సరైన శరీర భంగిమను ఇస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి ధ్యానంలో నిమగ్నం అయ్యేలా చేస్తుంది. అలసటను పోగొట్టి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
ఆరోగ్యం
భద్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు


