హైదరాబాద్: 28°C
వార్తలు

మూడు రోజులుగా తొలగించని చెత్త!

PLD: నరసరావుపేట పట్టణంలోని రమాదేవి ఆస్పత్రి సమీపంలో గత రెండు మూడు రోజులుగా చెత్త, వ్యర్థ పదార్థాలు రోడ్డుపై పేరుకు పోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దుర్వాసనతో పాటు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.