హైదరాబాద్: 28°C
వార్తలు

పొంగులేటి నేటి పర్యటన వివరాలు ఇవే

KMM: పాలేరు నియోజకవర్గంలో ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ దయాకర్‌రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా కూసుమంచి, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు. అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.