హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ వ్యక్తిత్వంపై మాజీ క్రికెటర్ ప్రశంసలు

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యక్తిత్వంపై అజింక్యా రహానే ప్రశంసలు కురిపించారు. ధోనీ ఎప్పుడూ ప్రశాంతంగా, సాధారణ వ్యక్తిలా ఉంటారని తెలిపారు. ఆయన గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవని, ఆటగాళ్లు స్వేచ్ఛగా మాట్లాడేవారని చెప్పారు. సీనియర్, జూనియర్ తేడా లేకుండా అందరినీ సమానంగా చూసే నాయకత్వమే ధోనీ గొప్పతనమని రహానే పేర్కొన్నారు.