ప్రకాశం: చంద్రశేఖరపురం తహసీల్దార్ ధర్మతేజను రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు కలిసి ఇండ్ల స్థలాలు, స్మశాన స్థలాల సమస్యలను పరిష్కరించాలని బుధవారం వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్, ఇంటి స్థలాలు అవసరమైన వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, స్మశాన స్థలాల సమస్యను వీఆర్వోల ద్వారా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వార్తలు
'సమస్యలు పరిష్కరించాలని వినతి'


