విశాఖ ఆరిలోవలో పీవీ సింధు అకాడమీ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "పీవీ సింధు ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలే భారతదేశ భవిష్యత్తు. జీవితం ఎటు తీసుకెళ్తుందో తెలియదు. కానీ ప్రతి విద్యార్థి ప్రయత్నానికి వ్యవస్థ ఉత్ప్రేరకంగా నిలిచి వారి లక్ష్యసాధనకు తోడ్పడాలి" అని పేర్కొన్నారు.
క్రీడలు
సింధు ప్రతి భారతీయుడి గర్వకారణం: మంత్రి


