హైదరాబాద్: 28°C
వార్తలు

'తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ'

VZM: మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. సూపర్వైజర్ హైమావతి తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ, పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వాలని, ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే అందించాలని, రెండేళ్ల వరకు కొనసాగించవచ్చని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లులు పాల్గొన్నారు.