హైదరాబాద్: 28°C
క్రీడలు

మూడేళ్లుగా సెంచరీ చేయలేదు!

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సెంచరీ నిరీక్షణ కొనసాగుతోంది. గత మూడేళ్లుగా ఈ పాకిస్థాన్ బ్యాటర్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తృటిలో శతకం చేజార్చుకున్నాడు. 147 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 88 పరుగులతో సెంచరీకి చేరువైన బాబర్, అబ్దుల్లా షఫీక్‌తో సమన్వయం లోపం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు.