హైదరాబాద్: 28°C
క్రీడలు

జట్టులో సీనియర్ల అవసరం ఉంది: రహానే

టెస్టు క్రికెట్‌లో భారత్ మళ్లీ పూర్వ వైభవం సాధించాలంటే యువ ఆటగాళ్లతో పాటు సీనియర్‌ క్రికెటర్లకు కూడా జట్టులో చోటు ఉండాలని మాజీ ఆటగాడు అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. సీనియర్లు ఒకేసారి తప్పుకోవడం జట్టుపై ప్రభావం చూపుతుందని, టెస్టుల్లో విజయాలు సాధించాలంటే పట్టుదల, పోటీతత్వం, ప్రతి సెషన్‌ను పూర్తిగా ఆడే మనస్తత్వం అవసరమని పేర్కొన్నాడు.