హైదరాబాద్: 28°C
వ్యాపారం

పెట్రో ఉత్పత్తులపై పన్ను పెంపు

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తుల ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును భారీగా పెంచింది. డీజిల్‌ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.15.5 నుంచి రూ.25.5కు పెంచగా, విమాన ఇంధనం(ATF)పై రూ.14.5 నుంచి రూ.22కు పెంచింది. పెట్రోల్‌ ఎగుమతిపై కూడా పన్నును రూ.2.5 నుంచి రూ.3.5కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.