టెలికాం పరికరాల తయారీ దిగ్గజం 'HFCL' భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఆప్టికల్ ఫైబర్, కేబుళ్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు రూ.400 కోట్ల పెట్టుబడికి సంస్థ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతర్గత వనరులు, బ్యాంక్ రుణాల ద్వారా ఈ నిధులను సేకరించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. కాగా, ఈ భారీ విస్తరణ ప్రక్రియ 2028 జులై నాటికి పూర్తవుతుందని ఒక ప్రకటనలో అంచనా వేసింది.
వ్యాపారం
ఫైబర్ కేబుళ్ల తయారీకి భారీ నిధులు


