హైదరాబాద్: 28°C
వ్యాపారం

అదానీ గ్రీన్‌లో అదానీ ఇన్‌ఫ్రా వాటా

అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థలో అదానీ ఇన్‌ఫ్రా భారీ పెట్టుబడి పెట్టింది. ప్రమోటర్ గ్రూప్‌నకు చెందిన అదానీ ఇన్‌ఫ్రా ఏకంగా రూ.2,380 కోట్లు వెచ్చించి 1.03 శాతం వాటాను దక్కించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 1.7 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఈ భారీ బ్లాక్ డీల్ లావాదేవీలో ఒక్కో షేరు ధరను రూ.1,400గా నిర్ణయించడం గమనార్హం.