హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఈవీల తయారీకి రూ.530 కోట్ల నిధులు

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భారీగా నిధులను సమీకరించింది. రైట్స్ ఇష్యూ ద్వారా ఏకంగా రూ.530 కోట్లను సమకూర్చుకున్నట్లు ఇటీవల వెల్లడించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ నిధులను మరిన్ని ద్విచక్ర, మూడు చక్రాల వాహనాల తయారీతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం వెచ్చించనున్నట్లు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ స్పష్టం చేసింది.