హైదరాబాద్: 28°C
వ్యాపారం

‘బంగారానికి ఖనిజ హోదా ఇవ్వండి’

బంగారాన్ని 'వ్యూహాత్మక ఖనిజం'గా గుర్తించాలని కేంద్రానికి ప్రపంచ స్వర్ణ మండలి(WGC) సూచించింది. ఈ హోదా ఇస్తే దేశీయంగా పసిడి తవ్వకాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు లభిస్తాయని WGC భారత సీఈఓ సచిన్ జైన్ తెలిపారు. తద్వారా రాష్ట్రాల అనుమతులతో పనిలేకుండా కేంద్రం నుంచే నేరుగా గనుల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని, పసిడి దిగుమతులు కూడా తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు.