హైదరాబాద్: 28°C
వ్యాపారం

రెట్టింపైన ఓఎన్‌జీసీ లాభాలు

ప్రభుత్వ చమురు దిగ్గజం ఓఎన్‌జీసీ కాసుల వర్షం కురిపించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా రూ.17,033.81 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే సమయానికి వచ్చిన రూ.8,024 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. ముడిచమురు ధరల పెరుగుదలతో బ్యారెల్‌పై లాభం $99.45కు చేరింది. అలాగే, కంపెనీ మొత్తం ఆదాయం రూ.33,213 కోట్ల నుంచి రూ.48,321 కోట్లకు వృద్ధి చెందింది.