హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా కోచ్‌లకు బీసీసీఐ వీడ్కోలు

టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌ల కాంట్రాక్ట్ ముగిసింది. దీంతో భారత జట్టుకు వీరు అందించిన అమూల్యమైన సేవలను గుర్తుచేసుకుంటూ బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది. 'జట్టు కోసం మీరు చేసిన సేవలు చిరస్మరణీయం. మీ భవిష్యత్తు కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం' అంటూ బీసీసీఐ వారిని అభినందించింది.