టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన ఫేవరేట్ కోచ్ అని వెల్లడించాడు. రవిశాస్త్రి కోచింగ్ శైలి తనకు చాలా ఇష్టమని, ఆటగాళ్లకు ఆయన మైదానంలో పూర్తి స్వేచ్ఛ ఇస్తాడని తెలిపాడు. రవిశాస్త్రి హయాంలో తాను ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంతో స్వేచ్ఛగా బౌలింగ్ చేశానని పేర్కొన్నాడు.
క్రీడలు
రవిశాస్త్రే నా ఫేవరేట్ కోచ్: షమీ


