హైదరాబాద్: 28°C
వ్యాపారం

వాట్సప్‌లో ఐటీ నోటీసులు వస్తున్నాయా?

వాట్సప్‌లో ఐటీ నోటీసుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు. నకిలీ మెసేజ్‌లు పంపి జిప్ లేదా .exe ఫైల్స్ డౌన్‌లోడ్ చేయమంటూ మాల్‌వేర్ చొప్పిస్తున్నారు. దీనిద్వారా ఫోన్‌లోని కీలక సమాచారం తస్కరిస్తున్నారు. ఇలాంటి నకిలీ నోటీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఐటీ శాఖ పోర్టల్ ద్వారానే నోటీసులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.