ఎయిర్‌టెల్ ఈ ఏడాది జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. పన్ను అనంతరం రూ.8,167 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఇది 37.3% వృద్ధి. భారత్, ఆఫ్రికా వ్యాపారాలు బలపడటమే కారణమని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల వల్ల వచ్చే ఆదాయం 18.3% పెరిగి రూ.58,539 కోట్లకు చేరింది. అలాగే ఒక యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.250 - రూ.264కు పెరిగినట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది.
వ్యాపారం
ఎయిర్‌టెల్ లాభం రూ.8,167 కోట్లు


