హైదరాబాద్: 28°C
వ్యాపారం

నిలిచిన వాట్సాప్ సేవలు.. స్పందించిన కంపెనీ

ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌ వినియోగదారులు ఊహించని సమస్యను ఎదుర్కొన్నారు. పలువురి ఖాతాలు 'అండర్‌ రివ్యూలోకి' వెళ్లడంతో చాటింగ్‌, కాల్స్‌ నిలిచిపోయాయి. దీనిపై స్పందించిన కంపెనీ.. సేవలను దుర్వినియోగం చేసే ఖాతాలను గుర్తించే క్రమంలోనే ఇది జరిగిందని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని తెలిపింది. కొన్ని పనుల వల్ల ఖాతాలు తాత్కాలికంగా రివ్యూలోకి వెళ్తాయని వెల్లడించింది.