ASR: చింతపల్లి మండలం కిటుముల పంచాయతీ రాకోట ప్రాంతంలో ఉపాధి పథకం కింద పనిచేసిన 20మంది గిరిజన కూలీలకు 10వారాలుగా వేతనాలు జమ కాలేదని వారు ఆవేదన చెందారు. అడవిలో గోతుల తవ్వకం, కాలువల నిర్మాణం పనులు పూర్తి చేశామన్నారు. ఇప్పటికీ బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు. వీఆర్పీలను అడిగితే త్వరలోనే డబ్బులు వస్తాయని చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు.
వార్తలు
ఉపాధి హామీ పథకం వేతనాలు చెల్లించాలి


