హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఆదిత్య బిర్లా కొత్త పాలసీ.. 100% ప్రీమియం వాపస్

ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యువత కోసం నూతన బీమాను ప్రవేశపెట్టింది. 25-35 ఏళ్ల యువత కోసం 'యాక్టివ్ యువ' ఆరోగ్య బీమాను తెచ్చింది. 11 ఏళ్లలో బీమా మొత్తాన్ని 11 రెట్లు పెంచుకోవచ్చు. ఏడాదిలో 5 సార్లు OPD ఖర్చులు, మెటర్నిటీ కవరేజీ, ఆదాయ రక్షణ ఇందులో ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించేవారికి వార్షిక ప్రీమియాన్ని 100% తిరిగి చెల్లిస్తామని కంపెనీ తెలిపింది.