హైదరాబాద్: 28°C
వ్యాపారం

19 లక్షల కుటుంబాలకు జీరో బిల్లు

పీఎం సూర్యఘర్ పథకం అరుదైన మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా 50.06 లక్షల కుటుంబాలు లబ్ధి పొందగా, 19 లక్షల కుటుంబాలు జీరో బిల్లులు అందుకుంటున్నాయి. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.28,024 కోట్ల సబ్సిడీని జమ చేసినట్లు కేంద్రం తెలిపింది. 12 లక్షలకు పైగా కుటుంబాలు అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి ఏడాదికి సగటున రూ.3,500 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు.