హైదరాబాద్: 28°C
క్రీడలు

'HCA' కీలక నిర్ణయం

హైదరాబాద్‌ రాజీవ్ గాంధీ స్టేడియంలో భూగర్భ జలాల వినియోగం తగ్గించేందుకు HCA కీలక నిర్ణయం తీసుకుంది. వర్షపు నీటిని సేకరించి శుద్ధి చేసే ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఏటా 2 నుంచి 3 కోట్ల లీటర్లు వినియోగించనున్నట్లు NGTకి తెలిపింది. పిచ్ నిర్వహణపై దాఖలైన కేసులో భాగంగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించిన HCA, కొత్త వ్యవస్థ ఏర్పాటుకు కొంత గడువు ఇవ్వాలని ట్రైబ్యునల్‌ను కోరింది.