హైదరాబాద్: 28°C
వార్తలు

ఏజెన్సీ బంద్‌కు మద్దతుగా బైక్ ర్యాలీ

AKP: ఈ నెల 8న జరిగే రాష్ట్రవ్యాప్త ఏజెన్సీ బంద్‌కు మద్దతుగా మంగళవారం రావికమతం మండలం కళ్యాణపులోవ నుంచి జెడ్. బెన్నవరం వరకు గిరిజన సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. నాన్‌షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఎస్టీ సెల్ సేవలు అందించాలని నాయకులు గోవిందరావు డిమాండ్ చేశారు. రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.