హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ రేసింగ్.. వీడియో వైరల్

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెన్నైలో ఓ టైర్ల కంపెనీ ప్రచార కార్యక్రమంలో పాల్గొని సందడి చేశాడు. ఇరుంగట్టుకోట్టైలో ఉన్న మద్రాస్ అంతర్జాతీయ రేసింగ్ సర్క్యూట్‌లో బైక్‌పై రయ్ రయ్‌మంటూ చక్కర్లు కొట్టాడు. ధోనీ బైక్‌పై దూసుకుపోతుంటే అభిమానులు చప్పట్లు కొడుతూ ఉత్సహపరిచారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.