హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

టైఫాయిడ్ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు!

టైఫాయిడ్‌ను సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ పెరిగే జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అలసట, కడుపు నొప్పి, ఆకలి తగ్గడం, పొడి దగ్గు, ఛాతీ లేదా పొట్టపై గులాబీ రంగు మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రారంభ దశలో చికిత్స తీసుకుంటే వ్యాధిని సులభంగా నియంత్రించవచ్చని తెలిపారు.