హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 544 పాయింట్లు ఎగబాకి 78,639 మార్కు వద్ద స్థిరపడింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 390 పాయింట్ల లాభంతో 24,774 వద్ద ముగిసింది. ఉదయం నుంచే మార్కెట్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల బాట పట్టాయి.