హైదరాబాద్: 28°C
వార్తలు

అర్జీలను వారం రోజుల్లో పరిష్కరించాలి: కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ శర్మ 81 వినతులను స్వీకరించారు. వాటిని వెంటనే సంబంధిత శాఖలకు పంపిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గత వారం వరకు 144 జిల్లా ప్రజావాణి, సీఎం ప్రజావాణికి చెందిన 47 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ, పాతవి-కొత్తవి అన్నీ వచ్చే వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.