హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్పీ కార్యాలయానికి 104 ఫిర్యాదులు

కర్నూలు: విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 104 ఫిర్యాదులు అందాయన్నారు. భూ ఆక్రమణలు, కుటుంబ వేధింపులు, దాడులు, మోసం, ప్రజా సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.