ASR: చింతపల్లి మండలానికి 683 క్వింటాళ్ల రాజ్‌మా విత్తనాలు కేటాయించినట్లు ఏవో మధుసూదనరావు తెలిపారు. సోమవారం చింతపల్లి-2, చింతపల్లి-3, చౌడుపల్లి-1, చౌడుపల్లి-2, బెన్నవరం, ఏ.శనివారం, అన్నవరం, బలపం రైతు సేవా కేంద్రాలకు విత్తనాలు చేరవేస్తున్నామన్నారు. విత్తనాల మొలకశాతం పరిశీలించి, ప్రయోగశాలలో నాణ్యత పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే రైతులకు పంపిణీ చేస్తామన్నారు.
వార్తలు
'నాణ్యత పరీక్షలు పూర్తయిన తర్వాతే పంపిణీ'


