ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి భారత చమురు దిగుమతులు జులైలో రికార్డు స్థాయికి చేరాయి. జూన్‌లో 2.7 మిలియన్ బ్యారెళ్లు ఉండగా, జులై నాటికి రోజుకు 2.8 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. దీంతో దేశ మొత్తం చమురు దిగుమతులలో రష్యా వాటా 55.5 శాతానికి చేరింది. రష్యా చమురు నిరంతరం అందుబాటులో ఉండటమే ఇందుకు కారణమని కెప్లర్ సంస్థ తెలిపింది.
వ్యాపారం
రికార్డు స్థాయిలో రష్యా చమురు దిగుమతులు


