హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర, రాష్ట్ర విధానాలపై సీపీఐ ఆందోళనలు

PLD: నరసరావుపేటలో సోమవారం సీపీఐ కార్యాలయంలో ఆగస్టు 6–15 వరకు నిర్వహించే ప్రచార పాదయాత్రలు, జాతాలు, సెప్టెంబర్ 1న జరిగే "ఛలో ఢిల్లీ" కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.