హైదరాబాద్: 28°C
వార్తలు

చీరాలలో 'ఇంటింటికి టీడీపీ' ప్రచారం

BPT: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 'ఇంటింటికి టీడీపీ' ప్రచారంలో భాగంగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మార్కెట్ సెంటర్‌లో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ప్రతి కుటుంబానికి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.