హైదరాబాద్: 28°C
క్రీడలు

బుమ్రా అవుట్.. రీప్లేస్‌మెంట్ ప్రకటించిన BCCI

టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో యాజమాన్యం అతడికి విశ్రాంతిని పొడిగించింది. అతడి స్థానంలో జమ్మూకాశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబీని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించి BCCI తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.