హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మెటబాలిజాన్ని పెంచే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఏది?

మనం రోజులో తీసుకునే మొదటి ఆహారం మెటబాలిజాన్ని (జీవక్రియను) చురుగ్గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రంతా ఏమీ తినకుండా ఉన్న శరీరానికి ఉదయాన్నే సరైన ఇంధనం అందిస్తేనే రోజంతా క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. తాజా పండ్లు, శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని ఉదయం డైట్‌లో భాగం చేసుకోవాలి.