హైదరాబాద్: 28°C
వార్తలు

గంగాలమ్మను దర్శించుకున్న సుబ్బారాయుడు

W.G: నరసాపురం మండలం ఎల్.బి. చర్లలో శ్రీ గంగాలమ్మ అమ్మవారిని కాపు కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు  దర్శించుకున్నారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. కొత్తపల్లి సుబ్బారాయుడు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు.