అవయవ దాన దినోత్సవం రోజు విశాఖలో ఉండటం సంతోషంగా ఉందని భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ పేర్కొంది. 'అవయవ దానంపై అవగాహన పెంచడం ఎంతో ముఖ్యం. తమ వారిని కోల్పోయిన కష్టసమయంలోనూ, కుటుంబాలు తీసుకునే ఈ నిస్వార్థ నిర్ణయం మరొకరికి పునర్జన్మ ఇస్తుంది. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపే ఈ కార్యం గురించి అందరికీ తెలియాలి. ప్రాణాలు కాపాడుతున్న వైద్య సిబ్బందికి అభినందనలు' అని అన్నారు.
క్రీడలు
ఇక్కడ ఉండటం సంతోషంగా ఉంది: సింధూ


