హైదరాబాద్: 28°C
క్రీడలు

18 ఏళ్ల తర్వాత భారత్‌కు టైటిల్‌

తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు చెందిన 17 ఏళ్ల తన్వి శర్మ అదరగొట్టింది. వియత్నాంకు చెందిన థుయ్ లిన్‌ను 21-16, 21-16 తేడాతో వరుస సెట్లలో ఓడించి టైటిల్ గెలిచింది. దీంతో భారత్‌కు 18 ఏళ్ల తర్వాత తైపీ ఓపెన్ టైటిల్‌ను అందించింది. గతంలో 2008లో తైపీ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.