భోజనం చేశాక నిద్ర ముంచుకొస్తోందా? ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. మనం తిన్న ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటే, బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగి మెదడును రిలాక్స్ చేసే సెరోటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది. దీనిని నివారించడానికి మితంగా తినాలి. కార్బోహైడ్రట్లు తగ్గించి ప్రొటీన్లు, ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. తిన్న వెంటనే పడుకోకుండా చిన్నపాటి నడక మేలు చేస్తుంది.
ఆరోగ్యం
భోజనం చేశాక నిద్ర వస్తోందా..?


