హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఒత్తిడిని తగ్గించే చిట్కాలు

రోజులో కొన్ని నిమిషాలు ధ్యానం లేదా దీర్ఘంగా శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం లేదా నడక చేయడం వల్ల హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ప్రతిరోజూ 7-8 గంటల గాఢమైన నిద్ర మానసిక ప్రశాంతతకు ముఖ్యం. సమతుల్య ఆహారం తీసుకుంటూ, ఇష్టమైనవారితో మాట్లాడటం ద్వారా ఒత్తిడి దూరం అవుతుంది. మ్యూజిక్ వినడం, నచ్చిన ప్రదేశానికి వెళ్లడం వంటివి  చేయాలి.