NGKL: వెల్దండ మండలం కంటోనిపల్లి గ్రామంలో రహదారి దుస్థితిపై యువకులు వినూత్న నిరసన చేపట్టారు. బురదమయంగా మారిన ప్రధాన రహదారిపై ఈరోజు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రైతులు, విద్యార్థులు, అత్యవసర సేవలకు వెళ్లేవారు అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి బీటీ రోడ్డు నిర్మించాలని కోరారు.
వార్తలు
రోడ్డుపై నాట్లు వేసి యువకుల నిరసన


