హైదరాబాద్: 28°C
వార్తలు

'మీ కోసం' 1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

ATP: ప్రజా సమస్యల పరిష్కారం కోసం 'మీ కోసం' కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ కోరారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.