కోనసీమ: రాజోలు మండలంలో గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఆదివారం లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో కొబ్బరి, అరటి, కూరగాయల తోటలు నీట మునిగాయి. రామరాజు లంక గ్రామంలో వరి చేలను వరద నీరు ముంచేసిందని రైతులు తెలిపారు. ప్రతీ ఏటా వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లంక గ్రామాల ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
లంక గ్రామాలను ముంచేసిన వరద నీరు


