హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా సాధారణంగా ఉంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 86,231 మంది భక్తులు  దర్శించుకోగా 32,017 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.