శ్రీశైల క్షేత్రంలో వచ్చే నెల 13 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్, ఈవో తెలిపారు. మిగతా రోజుల్లో ఇవి యథావిధిగా కొనసాగుతాయని, టికెట్ల కోసం 'మన మిత్ర' యాప్‌లో ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని కోరారు.
భక్తి
శ్రీశైలం శ్రావణ మాసోత్సవాలు.. ఛైర్మన్ కీలక ప్రకటన


