హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లలో అధికారులు అన్ని వసతులు కల్పించారు. నిన్న శ్రీవారిని 80,003 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,918 మంది భక్తులు తలనీలాల సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.59 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.